TELUGU
24, జులై 2010, శనివారం
12, జూన్ 2010, శనివారం
TELUGU
తెలుగు
వికీపీడియా నుండి
![]() | నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. |
తెలుగు | ||||
---|---|---|---|---|
మాట్లాడే దేశాలు: | భారతదేశం | |||
ప్రాంతం: | ఆంధ్ర ప్రదేశ్ | |||
మాట్లాడేవారి సంఖ్య: | 7.6 కోట్లు (మాతృభాష), 8.61 కోట్లు మొత్తం (రెండవ భాషగా మాట్లాడే ప్రజలతో సహా) | |||
ర్యాంకు: | 13 (మాతృభాష) | |||
భాషా కుటుంబము: | ద్రవిడ దక్షిణ-మధ్య తెలుగు | |||
వ్రాసే పద్ధతి: | తెలుగు లిపి | |||
అధికారిక స్థాయి | ||||
అధికార భాష: | ![]() | |||
నియంత్రణ: | అధికారిక నియంత్రణ లేదు | |||
భాషా సంజ్ఞలు | ||||
ISO 639-1: | te | |||
ISO 639-2: | tel | |||
ISO 639-3: | tel | |||
|

తెలుగు, భారత దేశము లోని దక్షిణ ప్రాంతములోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు అధికార భాష, మరియు దాని పక్క రాష్ట్రములయిన తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా,చత్తీస్‌గఢ్ ప్రజలు మాట్లాడే భాష. ప్రపంచంలో అత్యధికముగా మాట్లాడే వాటిలో పదిహేనవ స్థానములోనూ, భారత దేశములో రెండవ స్థానములోను నిలుస్తుంది.2001 జనాభా లెక్కల ప్రకారం 74002856 మంది ఈ భాషను మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళముల తో బాటు తెలుగు భాషను అక్టోబరు 31, 2008న భారత ప్రభుత్వము చేర్చింది.
[మార్చు]ఉపోద్ఘాతము
| ||||||
| ||||||
|
భాషా శాస్త్రకారులు తెలుగును ద్రావిడ భాషా వర్గమునకు చెందినదిగా వర్గీకరించినారు. అనగా తెలుగు హిందీ,సంస్కృతము, లాటిను, గ్రీకు మొదలగు భాషలు చెందు ఇండో ఆర్య భాషావర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు ) చెందకుండా, తమిళము, కన్నడము, మళయాళము, తోడ, తుళు, బ్రహుయి మొదలగు భాషలతోపాటుగా ద్రావిడ భాషా వర్గమునకు చెందును. తెలుగు 'మూల మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టినది. ఈ కుటుంబములో తెలుగుతో బాటు సవర, గొండి, కుయి, కోయ, కొలమి కూడ ఉన్నాయి[1].
తూర్పున కూరఖ్, మాల్తో భాషలు, వాయవ్యాన పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో మాట్లాడే బ్రహూయి భాషా, దక్షిణాన ఉన్న తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. ఆర్యభాషలు భారతదేశం ప్రవేశించక ముందు ద్రావిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషాచరిత్రకారుల నమ్మకం. సింధులోయ నాగరికతలోని భాష గురించి ఖచ్చితంగా ఋజువులు లేకపోయినప్పటికీ, అది ద్రావిడ భాషే అవటానికి అవకాశాలు ఎక్కువని కూడా వీరి అభిప్రాయం.
తెలుగు ఇతర భాషా పదాలను సులభంగా అంగీకరిస్తుంది. సంస్కృతము ప్రభావము తెలుగు సాహిత్యముపై చాలా ఎక్కువ. సంస్కృతము చూపించినంత ప్రభావము ఇంక ఏ భాష కూడా తెలుగు భాషపై చూపలేదు. నిజానికి తెలుగు లిపిలో చాలా అక్షరములు, ముఖ్యముగా మహాప్రాణ (aspirated) హల్లులు కేవలం సంస్కృతము కోసమే లిపిలోనికి తీసుకొనబడినాయి. "మంచి సంస్కృత ఉచ్చారణ కోస్తా ప్రాంతములోని పండితుల దగ్గర వినవచ్చు" అని చెప్పడం అతిశయోక్తి కాదు. అంతేకాకుండా ఇక్కడి పండితులను పొరుగు రాష్ట్రాల వారు వైదిక కర్మలను జరపడానికి ప్రత్యేకంగా పిలుచుకొని వెళ్ళేవారు అని ప్రతీతి. తెలుగుకి, సంస్కృతమునకు చాలా దగ్గర సంబంధం ఉండడం వలన వారి ఉఛ్ఛారణ స్వఛ్ఛంగా ఉంటుందనటంలో అతిశయోక్తి ఏమీలేదు. ఇప్పటికీ తెలుగు భాషలో సంస్కృత పదములను మనం గమనించవఛ్ఛు. సంస్కృత భాషా ప్రభావం భారత దేశ భాషలన్నింటి మీద ఉంది. కానీ తెలుగు భాషని గమనిస్తే, తెలుగుకి సంస్కృతం మాతృమూర్తి అనిపిస్తుంది. ఎందుకనగా ఉఛ్ఛారణ, భావం సంస్కృతం ను తలపిస్తాయి.
సంస్కృతము తెలుగు సాహితీ ప్రపంచంలో ఓ శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నట్లే, పర్షియను, ఉర్దూ పదాలు కూడా తెలుగు కార్యనిర్వాహక పదబంధములలో ఓ స్థానం ఏర్పరుచుకున్నవి. బ్రిటీషు వారి పరిపాలనవల్ల, మరియుసాంకేతిక విప్లవం వల్ల ఈ రోజుల్లో ఏ ఇద్దరు తెలుగువాళ్ళు కూడా ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఆంగ్ల పదాలు లేకుండా తెలుగులో మాట్లాడుకోలేరు అని చెప్పడం సత్యదూరం కాదు. భారతదేశంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ప్రముఖ జన్యు (Genetic) శాస్త్రవేత్త అయిన జె.బి.ఎస్.హాల్డేన్ గారు ఓ సందర్భములో తెలుగు భారత దేశానికి జాతీయ భాష కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పడములో ఆశ్చర్యము లేదు.
తెలుగువారికి ఆంగ్లము అంటే ఇంత ప్రేమ ఉన్నప్పటికీ భాషాశాస్త్రపరంగా, సంస్కృతీపరంగా, వ్యాకరణ పరంగానూ ఈ రెండు భాషలూ చాలా దూరంలో ఉంటాయి. తెలుగులో వాక్యం లో కర్త-కర్మ-క్రియ అవే వరుసలో వస్తాయి, కానీఇంగ్లీషు నందు మాత్రము కర్త-క్రియ-కర్మ గా వస్తాయి. ఆంగ్లము మాట్లాడువారికి తెలుగులో పదాల వరుస వ్యతిరేకదిశలో ఉంటాయి. ఇంకా చాలా తేడాలు ఉన్నాయి, ముఖ్యముగా past perfect Tense విషయములో.
భావ వ్యక్తీకరణలో తెలుగు ప్రపంచ భాషలన్నింటితోనూ పోటీ పడుతుంది. ప్రపంచంలోని అతి కొద్ది క్రమబద్ధీకరించబడిన భాషలలో ఇది ఒకటి. తెలుగు వ్యాకరణము చాలా తేలికగానూ, నిర్మాణపరంగా అతిశుద్ధంగానూ ఉంటుంది. అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష. ముఖ్యముగా కర్ణాటక సంగీతం లోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నవి. త్యాగరాజు, భద్రాచల రామదాసు, క్షేత్రయ్య,అన్నమయ్య, వంటివారు తమ తమ కృతులతో, కీర్తన లతో, తెలుగును సంగీతపరంగా సుసంపన్నం చేసినారు. పందొమ్మిదవ శతాబ్దానికి చెందిన యూరోపియనులు తెలుగును "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" (Italian of the east) అని పిలుచుకున్నారు.
తెలుగు (మరియూ ఇతర భారతదేశ బాషలలోని) ఒక ప్రముఖమైన విషయము ఏమిటంటే సంధి. రెండు పదాలు పక్కపక్కన చేర్చి పలికినప్పుడు మనకు క్రొత్త మూడవ పదము వస్తుంది.
[మార్చు]చరిత్ర
అనేక ఇతర ద్రావిడ భాషల వలె కాక తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీస్తు శకం మొదటి శతాబ్దము లో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు భాష మూలపురుషులు యానాదులు. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాలనాటిది[2].
ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు మనము తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6 వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దమునకు చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'. చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు.
ఆంధ్రులగురించి చెప్పిన పూర్వపు ప్రస్తావనలలో ఒకటి ఇక్కడ ఉదాహరింపబడినది: (డా.జి.వి.సుబ్రహ్మణ్యం కూర్చిన "తెలుగుతల్లి" కవితా సంకలనంలో ఇవ్వబడినది)
- పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే
- అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి
ఇది ఉద్యోతనుడు ప్రాకృతభాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం:
అందగత్తెలన్నా, అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమిచే వాళ్ళున్నూ, అందమైన శరీరాలు గల వాళ్ళున్నూ. తిండిలో దిట్టలున్నూ, అయిన ఆంధ్రులు అటూ, పుటూ (పెట్టు కాబోలు), రటూ (రట్టు ఏమో) అనుకొంటూ వస్తుండగా చూచాడు.
[మార్చు]తెలుగు, తెనుగు, ఆంధ్రము
ఈ మూడు పదాల మూలాలూ, వాని మధ్య సంబంధాలు గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. క్రీ.పూ.700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము)లో మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది. కనుక ఇదే మనకు తెలిసినంతలో ప్రాచీన ప్రస్తావన. ఆ తరువాత బౌద్ధ శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది. క్రీ.పూ. 4వ శతాబ్ధిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించినాడు.
ఆంధ్రులు మాట్లాడే భాషకు ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే పేర్లున్నాయి. ఆంధ్ర, తెలుగు అనేవి రెండు వేర్వేరు జాతులనీ అవి క్రమంగా మిళితమైనాయన్న కొంతమంది అభిప్రాయానికి జన్యు శాస్త్ర పరంగా కానీ భాషాశాస్త్ర పరంగా కానీ గట్టి ఆధారాలు దొరకవు. వైదిక వాఙ్మయం ప్రకారం ఆంధ్రులు సాహసోపేతమైన సంచారజాతి. భాషాశాస్త్ర పరంగా తెలుగు గోదావరి, కృష్ణా నదుల మధ్య నివసిస్తున్న స్థిరనివాసుల భాష. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని ఆంధ్ర రాజులు ముందుగా పరిపాలించడం వల్ల ఆంధ్ర, తెలుగు అన్న పదాలు సమానార్థకాలుగా మారిపోయాయని కొంతమంది ఊహాగానం. 10 వ శతాబ్దపు పారశీక చరిత్రకారుడు అల్ బిరుని తెలుగు భాషను 'ఆంధ్రీ' యని వర్ణించెను [3].
క్రీ.శ. 1000 కు ముందు శాసనాలలోగాని, వాఙ్మయంలో గాని తెలుగు అనే శబ్దం మనకు కానరాదు. 11వ శతాబ్దము ఆరంభమునుండి 'తెలుంగు భూపాలురు', 'తెల్గరమారి', 'తెలింగకులకాల', 'తెలుంగ నాడొళగణ మాధవికెఱియ' వంటి పదాలు శాసనాల్లో వాడబడ్డాయి.
11వ శతాబ్దములో నన్నయ భట్టారకుని కాలమునాటికి తెలుగు రూపాంతరముగా "తెనుగు" అనే పదము వచ్చినది. 13వ శతాబ్దములో మహమ్మదీయ చారిత్రికులు ఈ దేశమును "తిలింగ్" అని వ్యవహరించారు.
15వ శతాబ్దము పూర్వభాగంలో విన్నకోట పెద్దన్న తన కావ్యాలంకారచూడామణిలో ఇలా చెప్పాడు.
- ధర శ్రీ పర్వత కాళే
- శ్వర దాక్షారామ సంజ్ఙ వఱలు త్రిలింగా
- కరమగుట నంధ్రదేశం
- బరుదారఁ ద్రిలింగదేశ మనఁజనుఁ గృతులన్
- తత్త్రిలింగ పదము తద్భవంబగుటచేఁ
- దెలుఁగు దేశ మనఁగఁ దేటపడియె
- వెనకఁ దెనుఁగు దేశమును నండ్రు కొందరు
శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం - అనే మూడు శివలింగక్షేత్రాల మధ్య భాగము త్రిలింగదేశమనీ, "త్రిలింగ" పదము "తెలుగు" గా పరిణామము పొందినదనీ ఒక సమర్థన. ఇది గంభీరత కొరకు సంస్కృతీకరింపబడిన పదమేననీ, తెలుగు అనేదే ప్రాచీన రూపమనీ చరిత్రకారుల అభిప్రాయము. 12వ శతాబ్ధిలో పాల్కురికి సోమనాధుడు "నవలక్ష తెలుంగు" - అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము - అని వర్ణించాడు.
మొత్తానికి ఇలా తెలుగు, తెనుగు, ఆంధ్ర - అనే పదాలు భాషకూ, జాతికీ పర్యాయ పదాలుగా రూపు దిద్దుకొన్నాయి.
[మార్చు]భాష స్వరూపము
తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఇటాలియన్) గా అభివర్ణించాడు.
తెలుగు లిపిలో చాలవరకు ఉచ్చరించగల ఏకాక్షరాలతో ఉండి, ఎడమనుండి కుడికి, సరళమైన, సంక్లిష్టమైన అక్షరాల సరళితో కూడి ఉంటుంది. ఈ విధమైన ఉచ్ఛరించగల ఏకాక్షరాలు అనేకంగా ఉండడానికి ఆస్కారం ఉన్నందువల్ల, అక్షరాలు "అచ్చులు" ( వొవెల్స్ లేదా స్వర్ ) మరియు "హల్లులు" ( కాన్సొనెంట్స్ లేదా వ్యంజన్ ) అన్న ప్రధానమైన ప్రమాణాలను కలిగి ఉన్నాయి. హల్లుల రూపు వాటి వాడుకను బట్టి, సందర్భానుసారము మార్పు చెందుతూ ఉంటుంది. అచ్చుల ధ్వని వాటిలో లేనప్పుడు హల్లులు పరిశుద్ధమైనవిగా పరిగణించబడతాయి. అయితే, హల్లులను వ్రాయడానికీ , చదవడానికీ, అచ్చు "అ" ను చేర్చడం సాంప్రదాయకం. హల్లులు వేర్వేరు అచ్చులతో చేరినప్పుడు, అచ్చుఅంశం వర్ణ పరిచ్ఛేదముతో "మాత్రలు" అన్నసంకేతాలను ఉపయోగించడంతో గుర్తింపబడుతుంది. ఈ "మాత్రల" ఆకారాలు తమ తమ హల్లుల ఆకారాలకు ఎంతో విరుద్ధంగా ఉంటాయి. తెలుగులో ఒక వాక్యం "పూర్ణవిరామం"తో కానీ, "దీర్ఘవిరామం"తో కానీ ముగించబడుతుంది. అంకెలను గుర్తించడానికి తెలుగులో ప్రత్యేకంగా సంకేతాలున్నా, అరాబిక్ అంకెలే విస్తృతంగానూ, సర్వసాధారణంగానూ ఉపయోగింపబడుతున్నాయి.
ఈ విధంగా, తెలుగులో, 16 అచ్చులు, 3 విశేషఅచ్చులు, 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు కలవు.
తెలుగును సాధారణంగా ఒకదానితో ఒకటి కలిసి చేరి పోయే భాషగా గుర్తిస్తారు, ఇందులో ఒక నామవాచకానికి దాని ఉపయోగాన్ని బట్టి ప్రత్యేకమైన అక్షరాలు చేర్చబడతాయి. వ్యాకరణపరంగా, తెలుగులో కర్త, కర్మ, క్రియ, ఒక పద్ధతి ప్రకారం, ఒకదాని తర్వాత మరొకటి వాక్యంలో వాడబడతాయి.
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఌ | ౡ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః |
/a/ | /ɑː/ | /ɪ/ | /iː/ | /u/ | /uː/ | /ru/ | /ruː/ | /lu/ | /luː/ | /e/ | /eː/ | /ai/ | /o/ | /oː/ | /au/ | /am/ | /aha/ |
[మార్చు]గ్రాంథిక వ్యావహారిక భాషా వాదాలు
నన్నయకు పూర్వమునుండి గ్రాంథిక భాష మరియు వ్యావహారిక భాష స్వతంత్రముగా పరిణామము చెందుతూ వచ్చాయి. కానీ 20 వ శతాబ్దము తొలి నాళ్లలో వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలు తీవ్ర వాదోపవాదాలకు దారితీసాయి. గ్రాంథికము ప్రమాణ భాష అని, స్థిరమైన భాష అని, దాన్ని మార్చగూడదని గ్రాంథిక భాషా వర్గము, ప్రజల భాషనే గ్రంథ రచనలో ఉపయోగించాలని వ్యావహారిక భాషా వర్గము వాదించడముతో తెలుగు పండితలోకము రెండుగా చీలినది.
19 వ శతాబ్దం వరకూ తెలుగు రచనలు గ్రాంథిక భాషలోనే సాగినాయి, కానీ తరువాత వాడుక భాషలో రచనలకు ప్రాముఖ్యం పెరిగినది. ప్రస్తుతం రచనలు, పత్రికలు, రేడియో, దూరదర్శిని, సినిమాలు మొదలైనవన్నీ కూడా వాడుక భాషనే వాడుతున్నాయి.
[మార్చు]మాండలికాలు
ఆంధ్ర , బుడబుక్కల , డొక్కల , చెంచు , ఎకిడి , గొడారి, బేరాది, దాసరి , దొమ్మర , గోలారి, కమ్మర , కామాటి, కాశికాపిడి , కొడువ, మేదరి , మాలబాస, మాతంగి , నగిలి, పద్మసాలి , జోగుల , పిచ్చుకుంట్ల , పాముల , కొండ రెడ్డి, తెలంగాణా, తెలుగు, సగర, వడగ, వడరి, వాల్మీకి , యానాది , బగట, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, రాయలసీమ, నెల్లూరు, గుంటూరు, మద్రాసు(వడుగ ), ఒరిస్సా(బడగ )--1961 సెన్సస్, బంజారా[లంబాడి],
[మార్చు]లిపి
ప్రధాన వ్యాసము: తెలుగు లిపి
[మార్చు]లిపి పరిణామము
తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన బ్రాహ్మీ లిపినుండి ఉద్భవించింది. అశోకుని కాలములో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాషనుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. అశోకుడి కాలానికి చెందిన బ్రాహ్మి లిపి రూపాంతరమైన భట్టిప్రోలు లిపి నుంచి తెలుగు లిపి ఉద్భవించింది[4].
ఈ లిపిని బౌద్ధులు, వర్తకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు అందచేసారు. అక్కడ ఈ లిపి, మాన్, బర్మీస్, థాయ్, ఖ్మేర్, కామ్, జావనీస్, మరియు బాలినీస్ భాషల లిపుల ఉద్భవానికి కారకమయ్యింది. తెలుగు లిపి తో వాటికి స్పష్టంగా పోలికలు కనిపిస్తాయి. తెలుగు అక్షరమాల చూడడానికి దాని సమీప దాయాదియైన కన్నడ అక్షరమాల వలనే కనిపిస్తుంది.
[మార్చు]ప్రస్తుత లిపి
- అచ్చులు (16)
- అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఏ ఐ ఒ ఓ ఔ
- ప్రాణ్యక్షరములు (2)
- అం అః
- ఉభయాక్షరములు (3)
- అఁ అం అః
- హల్లులు (38)
- క ఖ గ ఘ ఙ
- చ ౘ ఛ జ ౙ ఝ ఞ
- ట ఠ డ ఢ ణ
- త థ ద ధ న
- ప ఫ బ భ మ
- య ర ల వ శ ష స హ ళ క్ష ఱ
- అంకెలు(10)
- ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౦
ప్రయత్న నియమావళి | కంఠ్యము (జిహ్వామూలము) | తాళవ్యము (జిహ్వామధ్యము) | మూర్ధ్యన్యము (జిహ్వాగ్రము) | దంత్యము (జిహ్వాగ్రము) | దంతోష్ఠ్యము | ఓష్ఠ్యము (అథోష్ఠము) | |||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
స్పర్శము, శ్వాసము, అల్పప్రాణము | క | చ | ట | త | - | ప | |||||||
స్పర్శము, శ్వాసము, మహాప్రాణము | ఖ | ఛ | ఠ | థ | - | ఫ | |||||||
స్పర్శము, నాదము, అల్పప్రాణము | గ | జ | డ | ద | - | బ | |||||||
స్పర్శము, నాదము, మహాప్రాణము | ఘ | ఝ | ఢ | ధ | - | భ | |||||||
స్పర్శము, నాదము, అల్పప్రాణము, అనునాసికము, ద్రవము, అవ్యాహతము | ఙ | ఞ | ణ | న | - | మ | |||||||
అంతస్థము, నాదము, అల్పప్రాణము, ద్రవము, అవ్యాహతము | - | య | ర (లుంఠితము) ళ(పార్శ్వికము) | ల (పార్శ్వికము) ఱ (కంపితము) | వ | - | |||||||
ఊష్మము, శ్వాసము,మహాప్రాణము,అవ్యాహతము | విసర్గ | శ | ష | స | - | - | |||||||
ఊష్మము,నాదము,మహాప్రాణము,అవ్యాహతము | హ | - | - | - | - | - |
[మార్చు]తెలుగు సాహిత్యం
- ప్రధాన వ్యాసం: తెలుగు సాహిత్యము
తెలుగు సాహిత్యాన్ని ఆరు యుగాలుగా వర్గీకరించ వచ్చును.
[మార్చు]క్రీ.శ. 1020 వరకు - నన్నయకు ముందు కాలం
11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగు లోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి. కాని అది బహుశా గ్రంథస్తం కాలేదు. లేదా మనకు లభించడం లేదు. అంతకు ముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండి ఉండే అవకాశం ఉన్నది. కాని మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం. క్రీ.శ. 575లో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం. (కడప జిల్లా కమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది). అంతకు ముందు కాలానికి చెందిన అమరావతీ శాసనంలో "నాగబు" అనే పదం కన్పిస్తుంది.
[మార్చు]1020-1400 - పురాణ యుగము
దీనిని నన్నయ్య యుగము అన వచ్చును. నన్నయ్య ఆది కవి. ఇతడు మహా భారతాన్ని తెలుగులో వ్రాయప్రారంభించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని(అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషుడు అయ్యాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచినాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించినారు; తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి,పండితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ, నారాయణులు యుగపురుషులు.వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య గారి అడుగు జాడలను అనుసరించిన వారే.
నన్నయ తరువాతికాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటు చేసుకొన్నాయి. వీరశైవము, భక్తిమార్గము ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది. తిక్కన(13వ శతాబ్ది), ఎర్రన(14వ శతాబ్దం)లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. ఇవి అధికంగా పురాణాలు ఆధారంగా వ్రాయబడ్డాయి.
[మార్చు]1400-1510 -మధ్య యుగము (శ్రీనాథుని యుగము )
ఈ కాలంలో సంస్కృతకావ్యాల, నాటకాల అనువాదం కొనసాగింది. కథాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి. "ప్రబంధము" అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపు దిద్దుకున్నది. ఈ కాలంలో శ్రీనాథుడు, పోతన, జక్కన, గౌరనపేరెన్నిక గన్న కవులు. ఛందస్సు మరింత పరిణతి చెందింది. శ్రీనాథుని శృంగార నైషధము, పోతన భాగవతం, జక్కన విక్రమార్క చరిత్ర, తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు.
ఈ సందర్భంలో రామాయణ కవులగురించి కూడా చెప్పకోవచ్చును. గోన బుద్దారెడ్డి రచించిన రంగనాథ రామాయణము మనకు అందిన మొదటి రామాయణం.
[మార్చు]1510-1600 - ప్రబంధ యుగము
విజయనగర చారిత్రకశకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది.స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యద తో "ప్రబంధం" అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాల తో ఆయన ఆస్థానం శోభిల్లింది.
[మార్చు]1600-1820 - దాక్షిణాత్య యుగము
కర్ణాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితా లోనివే త్యాగరాజు, అన్నమాచార్య, క్షేత్రయ్య వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగు నే ఎంచుకొన్నారు.
[మార్చు]1820 తరువాత - ఆధునిక యుగము
1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లోనే సాధ్యమయింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో , షెల్లీ, కీట్స్, వర్డ్స్వర్త్ వంటి కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు "భావకవిత్వం" అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.
మొట్టమొదటి నవలగా పరిగణించబడుతూన్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రము తో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గ్రాంథిక భాష వాడకాన్ని తీవ్రంగా నిరసిస్తూగిడుగు రామ్మూర్తి ప్రకటించిన ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం ప్రభావంతో గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), కట్టమంచి రామలింగారెడ్డి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం) మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యవహారిక భాషను వాడడం వ్యావహారిక భాషా వాదా నికి దారితీసింది.
[మార్చు]మారుతున్న సాహిత్యం
తెలుగు సాహిత్యంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. వార్తాపత్రికలు, దూరదర్శన్ కార్యక్రమాలు, రేడియో కార్యక్రమాలు భాషా పరిణామం చోటు చేసుకుంటుంది. మాటల పొందిక కరువైపోతుంది. తేటతెనుగు మాటల అల్లిక కరువైపోతుంది. స్వరమాధుర్యం కరువైపోతుంది. వక్తలు జారిపోతున్నారు. భాషాభివృద్ధికి పాటుపడే విధానాలు కుంటుబడ్తున్నాయి. పండితులకు ఆదరణ కరువైపోతుంది. తెలుగు భాషలో మట్లాడే వారే తక్కువైపోతున్నారు. ఆధునిక పోకడల పేరుతో మాతృభాష-స్వరూప స్వభావాలను, రూపురేఖలను మార్చేస్తున్నారు. కారణాలు వెతుక్కుంటూ పోతే యెన్నో- యెన్నెన్నో! మాటల ద్వారా, పాటల ద్వారా, సమాచార మాధ్యమాల ద్వారా, తెలుగు భాష సొబగులను, సొగసుందనాలను కాపాడుకుందామా ! గోదారి, కృష్ణా, తుంగా, పెన్నాల, యెన్నెన్నో సెలయేళ్ళ గలగలలు వింటూ తరించిపోదామా. నాటకాలు, నాటికలు, ప్రహనసనాలు, చతుర సంభాషణలు, జనపదాలు, పల్లె గీతాలు, చిందు గీతాలు, మొ- ని, మనం నిధిగా తలచి కాపాడుకోవాలి. ఇది తెలుగు వారి, ఆంధ్రుల సొత్తుగా మురిసి ముద్దైపోవాలి. భాషాభివృద్ధికి మనం జీవితాలను త్యజించాలి. సమయం ఆసన్నమైంది. ప్రోత్సాహకాలు ఇచ్చి భాష,భావాల సంపదను కాపాడుకోవాలి.
[మార్చు]కంప్యూటర్లో తెలుగుభాష
[మార్చు]తెలుగు యూనీకోడు
తెలుగు భాష అక్షరాలకు ఈ క్రింది యూనీకోడు బ్లాకు ఇవ్వబడినది 0C00-0C7F (3072-3199).
తెలుగు యూనీకోడ్.ఆర్గ్ పటం (పీడీఎఫ్) | ||||||||||||||||
0 | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | A | B | C | D | E | F | |
U+0C0x | ఁ | ం | ః | అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ఌ | ఎ | ఏ | |||
U+0C1x | ఐ | ఒ | ఓ | ఔ | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | |
U+0C2x | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | |
U+0C3x | ర | ఱ | ల | ళ | వ | శ | ష | స | హ | ా | ి | |||||
U+0C4x | ీ | ు | ూ | ృ | ౄ | ె | ే | ై | ొ | ో | ౌ | ్ | ||||
U+0C5x | ౕ | ౖ | ||||||||||||||
U+0C6x | ౠ | ౡ | ౦ | ౧ | ౨ | ౩ | ౪ | ౫ | ౬ | ౭ | ౮ | ౯ | ||||
U+0C7x |
- కొత్త చేర్పులు
~ja - ౙ,46 జెఒల్వొపజ్దొఇక్వెలొలొప్స్88వ్ప్=-జ్ద్ఫ్వ్కొఅన్ చ్బ్వ్య్ 0చ్00_0చ్7ఫ్
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]తెలుగు తొలిప్రొద్దు వెలుగులు
- శాసనాలలో తొలి తెలుగు పదం - వంషస్
- తొలి పూర్తి తెలుగు శాసనం - రేనాటి చోడులది
- తొలి తెలుగు కవి - నన్నయ
- తొలి తెలుగు కావ్యం - ఆంధ్రమహాభారతం
- తొలి తెలుగు నిర్వచన కావ్యం - నిర్వచనోత్తర రామాయణము
- తొలి తెలుగు ప్రబంధము -మనుచరిత్రము
- తొలి తెలుగు నవల - రాజశేఖర చరిత్రము
- తొలి తెలుగు కవయిత్రి - తాళ్ళపాక తిమ్మక్క
- తొలి తెలుగు వ్యాకరణము - ఆంధ్రభాషాభూషణము
- తొలి తెలుగు గణిత గ్రంథము -గణితసార సంగ్రహము
- తొలి తెలుగు ఛందశ్శాస్త్రము - కవి జనాశ్రయము
- తొలి తెలుగు శతకము - వృషాధిప శతకము
- తొలి తెలుగు నాటకము - మంజరీ మధుకీయము
- తొలి తెలుగు శృంగారకవయిత్రి - ముద్దుపళని
- తొలి తెలుగు కథానిక - దిద్దుబాటు
- తొలి తెలుగు దృష్టాంతశతకము - భాస్కర శతకము
- తొలి తెలుగు రామాయణము - రంగనాథ రామాయణము
- తొలి తెలుగు ద్వ్యర్థికావ్యము - రాఘవ పాండవీయము
- తొలి తెలుగు జంటకవులు - నంది మల్లయ, ఘంట సింగన
- తొలి తెలుగు పురాణానువాదము -మార్కండేయ పురాణము
- తొలి తెలుగు ఉదాహరణకావ్యము - బసవోదాహరణము
- తొలి తెలుగు పత్రిక - సత్యదూత
- తొలి తెలుగు నీతి శతకము - సుమతీ శతకము
- తొలి తెలుగు సాంఘిక నాటకము - నందకరాజ్యం
- తొలి తెలుగు వాగ్గేయకారుడు - అన్నమయ్య
- తొలి తెలుగు ద్విపదకవి - పాల్కురికి సోమన
- తొలి తెలుగు పద్యం (శాసనాలలో) - తరువోజ
- తొలి తెలుగు పద్యశాసనము - అద్దంకి శాసనము
- తొలి తెలుగు ధర్మశాస్త్రము - విజ్ఙానేశ్వరీయము
- తొలి తెలుగు పరిశోధనా వాఙ్మయ గ్రంథము - సకల నీతి సమ్మతము
- తొలి తెలుగు వ్యావహారిక నాటకము - కన్యాశుల్కం
- తొలి తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి - ఆంధ్రుల సాంఘిక చరిత్ర
- తొలి తెలుగు ఖురాన్ చిలుకూరి నారాయణరావు
- తొలి తెలుగు వ్యావహారికభాషా వచన గ్రంధం హితసూచని (1853) - స్వామినేని ముద్దునరసింహంనాయుడు (1792-1856).
- తొలి ఉరుదూ-తెలుగు నిఘంటువు - ఐ.కొండలరావు 1938
[మార్చు]తెలుగు ప్రముఖులు
- ఢిల్లీ దర్బారు (ఫిరొజ్ షా తుగ్లక్) లో తొలి వజీరు (ప్రధానమంత్రి)-- మాలిక్ మక్బూల్ / యుగంధర్ లేక దాది (సాగి) గన్నమ నాయకుడు.
- ప్రధాన మంత్రి అయిన తొలి తెలుగు వ్యక్తి--పి.వి.నరసింహారావు
- రాష్ట్రపతి అయిన తొలి తెలుగు వ్యక్తి--వి.వి.గిరి
- అంటార్కిటికా కు వెళ్ళిన తొలి తెలుగు వ్యక్తి--దాట్ల రామదాసు
- ఒలంపిక్ క్రీడలలో పతకం సాధించిన తొలి తెలుగు వ్యక్తి--కరణం మల్లేశ్వరి
[మార్చు]తెలుగువారి ఆస్తులు, ఆవిష్కరణలు
- మువ్వన్నెల జెండా- పింగళి వెంకయ్య తయారుచేసింది
- ఒంగోలు గిత్త
- తిరుపతి లడ్డు
- అమృతాంజనం -దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు 'ఆంధ్రపత్రిక' ఆ డబ్బుతోనే నడిచింది.
- కూచిపూడి నృత్యం
- అవధానం అష్టావధానం, శతావధానం, ద్విశతావధానం, సహస్రావధానం, శతసహస్రావధానం
- ఔషధాలు-మెథోట్రెక్సేట్.టెట్రాసైక్లిన్ .అరియోమైసిన్.హెట్రాజన్.విటమిన్ బి 12 ఫోలిక్ ఆమ్లం .వీటన్నిటిని ప్రపంచానికి అందించింది ఓ తెలుగు వ్యక్తే, డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు .
- స్టెంట్ ..అబ్దుల్ కలామ్ సహకారంతో ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ సోమరాజు రూపొందించిన 'స్టెంట్' హృద్రోగులకు ఓ వరం.
- కోహినూర్ వజ్రం-గుంటూరు సీమలోని కొల్లూరు లో పుట్టింది.
- ఆవకాయ బెల్లమావకాయ, ముక్కావకాయ, పెసరావకాయ, సెనగావకాయ, పులిహోర ఆవకాయ, గుత్తావకాయ, తొణుకావకాయ, నీళ్లావకాయ.మాగాయ. తేనె ఆవకాయ
- పీవీ సరళీకరణ విధానం, ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదం.బాలమురళి శాస్త్రీయం, బాలూ లలితగానం.చిరంజీవి నటన, అజహర్ అద్భుతాల క్రికెట్టు, శ్రీదేవి చిరునవ్వుల కనికట్టు.నాయుడమ్మ వైద్యం, బాపూ చిత్రం.
- గద్వాల, పోచంపల్లి, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, చిరాల, నారాయణపేట, మచిలీపట్నం చేనేతలు.
- బంగినపల్లి మామిడిపళ్లు, పలాస జీడిపప్పులు,ఆత్రేయపురం పూతరేకు లు, బందరు లడ్డూలు, తాపేశ్వరం కాజా లు.
- గోంగూర పచ్చడి . (http://www.eenadu.net/htm/weekpanel1.asp)
- తెలంగాణ బతుకమ్మ పండగ
- తెలంగాణ సమ్మక్క-సరలమ్మ జతర
- తిరుమల తిరుపతి దేవస్తానము
- హైదరాబాదు బిర్యాని
[మార్చు]తెలుగు సంస్థలు
[మార్చు]తెలుగు విజ్ఞాన సర్వస్వము
[మార్చు]తెలుగు వెబ్ సైట్లు
- తెలుగు జాతి http://www.telugujaathi.org/default.aspx