యేసు
వికీపీడియా నుండి
[దాచు] భాగం వ్యాసముల క్రమం |
---|
యేసు |
శుద్ధ జననం · క్రూసిఫిక్షన్ · రిసర్రెక్షన్ |
మూలాలు |
చర్చి · కొత్త కాన్వెంట్ అపోస్తలులు · సామ్రాజ్యం · గోస్పెల్ · కాలపట్టిక |
బైబిల్ |
పాత నిబంధన · కొత్త నిబంధన గ్రంధాలు · బైబిల్ చట్టాలు · అపోక్రైఫా |
క్రైస్తవ ధర్మం |
త్రిత్వము · (తండ్రి · కొడుకు · పరిశుద్ధాత్మ) చరిత్ర · ధర్మం · అపోలాజిటిక్స్ |
చరిత్ర మరియు సాంప్రదాయాలు |
ప్రథమ · సంఘాలు · వర్గలు · మిషనరీలు తూర్పు పశ్చిమ సంబంధాలు · క్రుసేడులు ·ఉద్ధారణలు |
తెగలు |
క్రైస్తవ మత విషయాలు |
బోధన · ప్రార్థన · ఎక్యూమెనిజం ఇతర మతాలతో సంబంధాలు · ఉద్యమాలు సంగీతం · లిటర్జీ · కేలండరు చిహ్నాలు · కళలు · విమర్శ |
30px క్రైస్తవ పోర్టల్ |
యేసు (Jesus) (క్రీ.పూ 7–2 నుండి క్రీ.శ 26–36 వరకు) [1] నజరేయుడైన యేసుగా కూడా పిలవబడే ఈయన పేరిట క్రైస్తవ మతము పౌలు గారిచే అంతియొకయలో ప్రారంబించబడింది.ఈయన యేసు క్రీస్తుగా కూడ వ్యవహరించబడతాడు. క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్ ("ఆభిషిక్తుడు")నుండి పుట్టింది.ఇది హీబ్రూలో "మెసయ్యా"కు సమానం.
కొత్త నిబంధన గ్రంథం లోని నాలుగు సువార్తలు మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను సువార్తలలో యేసు జీవితము మరియు బోధనలకు సంబంధించిన సమాచారం ఉంది.చాలా మంది బైబిలు పరిశోధకులు మరియు చరిత్రకారులు యేసు, గలిలయకు చెందిన ఒక యూదు మత బోధకుడని,బాప్తిస్మమిచ్చు యోహానుచే బాప్తిస్మము పొందాడనీ, తనను తాను దేవుని ఎకైక అద్వితీయ కుమారుడని తద్వార దేవునికి సమానుడనే, రోమన్ సామ్రాజ్యాన్ని మాయచేస్తున్నాడనే ఆరోపణలతో రోమన్ అధికారి పొంతి పిలాతు ఆజ్ఞానుసారము శిలువవేయబడ్డాడని అంగీకరిస్తారు.[2]
యేసుక్రీస్తుపై విభిన్న క్రైస్తవ ధృక్కోణాలు పాతనిబంధన గ్రంథం లేదా యూదు తోరాహ్ లో వస్తాడని చెప్పిన మెసయ్య లేదా క్రీస్తు ఈయనే అని, ఈయన సిలువవేయబడిన తరువాత సమాధి నుండి లేచి వచ్చాడనే భావనల పై కేంద్రీకృతమై ఉన్నాయి. అధిక శాతం క్రైస్తవులు యేసుని, తమ పాప ప్రక్షాళన కొరకు మరియు దేవునితో సమాధానపరుచుటకు పంపబడిన దేవుని కుమారుడిగా భావిస్తారు. త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మే క్రైస్తవులు యేసుని దేవుని యొక్క అవతారంగా భావిస్తారు.యేసు దైవత్వము సంబంధంచిన గూఢార్థాల విద్యను క్రిస్టోలొజి అని పిలుస్తారు.కన్యకు పుట్టటం,పరలోక ప్రయాణం , రెండవ రాకడ.అద్భుతాలు. యేసు పాత నిబంధన గ్రంథం లోని ప్రవచనాలను నెరవేర్చారని నమ్ముతారు.
యేసు జీవిత కాలం: యేసు జీవిత చరిత్ర నాలుగు సువార్తల్లో ఉందిగాని, యేసు క్రీస్తు పుట్టిన తేదీలేదు.పశ్చిమ దేశములలోని క్రైస్తవులు అంతా క్రీస్తు జన్మదిన పండుగగా క్రిస్టమస్ ను డిసెంబరు 25 వ తేదీన ఆనయాయతీగా జరుపుకొంటున్నారు.రోమా క్రైస్తవులు సుమారు క్రీ.శ.330 నుండి అలా జరుపుకొంటున్నారు.
విషయ సూచిక[దాచు] |
[మార్చు]యేసు జీవితం-భోదన
- ప్రధాన వ్యాసం: నూతన నిభందన ప్రకారం యేసు జీవితం
మూస:యేసు సువార్త యేసు జీవితం గురించి చారిత్రక ఆధారాల మూలంగా కూడా తెలుసు కోవడం కుదిరే పని కాదు. నాలుగుసువార్తల ద్వారా మనం యేసు జీవితాన్ని గురించి తెలుసుకొనగలం.
[మార్చు]యేసు వంశము-కుటుంబము
- ప్రధాన వ్యాసం: యేసు వంశము
మత్తయి మరియు మార్కు సువార్తలలో యేసు యొక్క వంశ వృక్షం వివరించబడంది.మత్తయి సువార్త యందు యేసు తండ్రియైన యోసేపుయొక్క పితరుల గురించి వివరించబడింది; లూకా సువార్తలో యేసు తల్లిదండ్రుల ఇద్దరి వంశ వృక్షాలున్నాయి.యేసు తల్లియైన మరియ.[3]యొక్క పితరుల వివరాలున్నాయి.యేసు యొక్క వంశ మూలపురుషులు రాజైన దావీదు మరియు అబ్రహాము.అబ్రహాము నుండి దావీదు వరకు ఉన్న మూల పురుషుల జాబితాలో యే విధమైన మార్పు ఉండదు గాని,దావీదు నుండి యోసేపు వరకు వ్రాయబడిన మూల పురుషుల జాబితాలో తేడా కనిపిస్తుంది.మత్తయి సొలోమోను తో ప్రారంభించి యూదా గోత్రములోని చివరి రాజైన యెకోన్యావరకు ప్రస్తావిస్తాడు. యెకొన్యా తరువాత రాజుల వంశ పరంపర బాబిలోన్ యూదాను జయించుటతో ఆగిపోతుంది.లూకా వ్రాసిన వంశవృక్షము అబ్రహాము కంటే ముందున్న ఆదాము-హవ్వ లవరకు సాగుతుంది.యోసేపు పేరు యేసు బాల్యదినముల ప్రస్తావనలో మత్రమే వినిపిస్తుంది. యేసు తల్లియైనమరియను ప్రేమించిన శిష్యుడు యోహాను కు అప్పగించడాన్ని బట్టి యేసు తన సేవను ప్రారంభించుటకు మునుపే యోసేపు చనిపోయి ఉంటాడని అర్థం చేసుకోవాలి. (యోహాను|19:25-27|యోహాను19:25–27), [4] యేసుకు బందువులు, సోదరులు మరియూ సోదరీమణులు ఉన్నారు.[5] గ్రీకులో adelphos అంటే సోదరుడు దగ్గరి బంధువు,రక్త సంబందికుడు..(see మరియ కన్యత్వం).
[మార్చు]పుట్టుక మరియు ప్రారంభ జీవితం
- ప్రధాన వ్యాసాలు: ప్రకటన, యేసు పుట్టుక & బాల యేసు
యేసు బెత్లహెం అను యూదా ప్రాంత పల్లెలోమరియ, అను కన్యకకు, పరిశుద్దాత్మ వలన జన్మించాడు. గబ్రియేలు దేవదూత మరియను దర్శించి దేవుడు మరియను తన కుమారునిగర్భమునందు మోయుటకు ఎన్నుకొన్నాడని తెలిపాడు.(లూకా 1:26–38). కైసర్ ఔగుస్తుస్ ఆజ్ఞ వలన యోసేపు మరియలు నజరేతును విడిచి యోసేపు పితరుడైన దావీదుయొక్క గ్రామమైన బెత్లెహేము కు తమ పేర్లను జన సంఖ్యలో వ్రాయించుకొనుటకు వెళ్ళారు.యేసు జన్మించినపుడు సత్రంలో వారికి స్థలము లేనందున పశువుల తొట్టె లో యేసును పరుండ బెట్టారు. (లూకా 2:1–7). లూకా సువార్త ప్రకారం,దేవ దూత యేసు జన్మించిన వార్తను గొల్లలకు తెలిపింది. అది విన్న ఆ గొల్లలు యేసును చూచి ఆ వార్తను ఆ ప్రదేశమంతట ప్రచురించారు."జ్ఞానులు" ఆకాశములో ఉదయించిన వింత నక్షత్రం వంక చూస్తూ వచ్చి యేసును దర్శించి తమ విలువైన బహుమతులను యేసుకు సమర్పించారు.మెస్సియా, లేదాయూదుల రాజు, పుట్టాడని గ్రహించారు.(మత్తయి 2:1-12) యేసు పుట్టిన పిదప వారు దూతచెప్పినట్లు ఈజిప్టు కు పారిపోయారు. యేసు బాల్యం గలలియ లోని నజరేతులోగడిచింది.యోసేపు మరియలు ఆ తరువాత తిరిగి నజరేతుకు వచ్చి అక్కడ నివసించారు.వారి కుటుంబం హేరోదు మరణ పర్యంతం ఈజిప్టు నందు నివసించారని వ్రాయబడి ఉంది. (మత్తయి|2:19-23|మత్తయి 2:19-23).ఈజిప్టుకు పారిపోవుట తూరు మరియు సీదోనులకు వెళ్ళుట మినహా, యేసు జీవితంలోని అన్ని సంఘటనలు ఇశ్రాయేలు , యూదాప్రాంతములయందే జరిగినవి. [6]యేసు ముప్పది యేండ్ల ప్రాయము వాడైనప్పుడు బాప్తీస్మము పొందెను. యేసు బాప్తీస్మము పొందుటకు ముందు ఆయన బాల్యానికి మధ్య ఒక సారి దేవాలయములో కనబడుట తప్ప మరి యెప్పుడు ఆయన గురించి ఏ సువార్తలోను ప్రస్తావించ బడలేదు. (లూకా|2:41-52|లూకా 2:41–52).యేసువడ్రంగి (మార్కు|6:3),వడ్రంగి వాని కుమారునిగా పిలువ బడ్డాడు.(మత్తయి|13:55),కాబట్టి యేసు వడ్రంగం పని చేసి ఉంటాడు. 'యేసు బాప్తీస్మము పొందటం , శోధనను జయించటం.' యేసు యోహాను ద్వారా బాప్తీస్మము పొందడం యేసు యొక్క పరిచర్య ప్రారంభం.యోర్దాను నదిలో ప్రజలకు బాప్తీస్మమిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్న యోహాను యొద్దకు యేసు బాప్తీస్మము పొందడానికి వచ్చాడు."తన యొద్దకు బాప్తీస్మము పొందడానికి వచ్చిన యేసును చూసిన యోహాను తనకు యేసునే బాప్తీస్మమిమ్మని అడిగితే , యేసు ఇప్పటికి నీతి నెరవేరునట్లుగా తనకు యోహానునే బాప్తీస్మమిమ్మని" అడిగాడు. యేసు బాప్తీస్మము పొంది నీటి నుండి లేచినప్పుడు, ఆకాశము తెరుచుకొని,దేవుని ఆత్మ పావురము వలే దిగివచ్చింది. "ఇతడు నా ప్రియ కుమారుడు. ఇతని యందు నేనానందించు చున్నాను" అని పరలోకము నుండి ఒక స్వరము వినబడింది. బాప్తీస్మము పొందాక యేసు అరణ్యములో 40 రోజులు ఉపవాసమున్నాడు.ఈ సమయంలో సాతాను యేసును శోధిస్తాడు.యేసు దేవుని వాక్యాలు చెప్పి సైతానును జయిస్తాడు.అప్పుడు సాతాను యేసును విడిచి పోతాడు. దేవ దూతలు వచ్చి యేసుకు ఉపచారాలు చేస్తారు.
[మార్చు]సేవ
- ప్రధాన వ్యాసాలు: యేసు పరిచర్య, కొండమీద ప్రసంగం, మైదానములో ప్రసంగం, పన్నెండు మంది శిష్యులు & యేసు రూపాంతరము పొందుట
యేసు మెస్సియ, "అనేకమంది ప్రాణవిమోచన క్రయ ధనంగా ప్రాణాన్ని అర్పించటానికి , "దేవుని రాజ్య సువార్తను ప్రకటించటానికీ వచ్చాను అని ప్రకటించాడు.[7] ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు.
[మార్చు]మరణం
యేసును సిలువమీద ఉంచి, అపహసించిన తరువాత మద్యాహ్నం పన్నెండు గంటలనుండి మూడు గంటల దాకా ఆ దేశమంతా చీకటి వ్యాపించింది. సుమారు మూడు గంటలప్పుడు యేసు బిగ్గరగా, "ఏలీ! ఏలీ! లామా సబక్తానీ?" అని కేకవేశాడు.ఏలీ అనే అరమిక్ పదం ఏలోహిం ,ఇలాహ్ అనే హెబ్రూ అరబిక్ పదాలకు సమానం. అంటే "నా దేవా ! నాదేవా నన్నెందుకు చేయి విడిచావు? అని అర్థం. అక్కడ నిల్చున్న వాళ్ళు కొందరు ఇది విని, "అతడు ఏలియాను పిలుస్తున్నాడు" అనుకున్నారు.
[మార్చు]యేసు తన శిష్యులకు నేర్పిన ప్రార్థన
"పరలోకమందున్న మా తండ్రీ,నీనామము పరిశుద్ధపరచబడుగాక.నీరాజ్యమువచ్చుగాక.నీచిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.మా అనుదినాహారము నేడుమాకు దయచేయుము.మా ఋణస్థులను మేముక్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.మమ్మును శోధనలోకి తేక కీడునుండి మమ్ము తప్పించుము.రాజ్యము బలము మహిమయు నీవై యున్నవి.ఆమెన్" (మత్తయి 6:10-13)
[మార్చు]దేవుడు మోషేకు ఇచ్చిన పదిఆజ్ఞలు
- నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు
- దేని రూపమును విగ్రహమును నీవు చేసికొనకూడదు.వాటికి సాగిలపడకూడదు.
- నా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు
- విశ్రాంతి దినమును పరిశుద్ధదినముగా ఆచరించాలి.
- నీతల్లిదండ్రులను సన్మానింపుము
- నరహత్య చేయరాదు
- వ్యభిచరింపరాదు
- అబద్ధసాక్ష్యము పలుకరాదు
- దొంగిలకూడదు
Cool you write, the information is very good and interesting, I'll give you a link to my site. 먹튀검증
రిప్లయితొలగించండిGoodness, cool post. I'd prefer to compose like this as well - requiring significant investment and genuine difficult work to make an incredible article... be that as it may, I put things off something over the top and never appear to begin. Much appreciated however. 검증사이트
రిప్లయితొలగించండి